ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసాధికార సర్వే పుష్కరాల కారణంగా నత్తనడకన సాగుతోంది. వీఆర్‌ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల ఉద్యోగులు పుష్కరాల విధుల్లో ఉండటం వల్ల సర్వే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు నిలిచిపోయింది.
సాధికార సర్వే @ 9
Aug 22 2016 12:34 AM | Updated on Sep 4 2017 10:16 AM
– జిల్లాలో 3,12,999 కుటుంబాల సర్వేపూర్తి
– రాష్ట్రంలో జిల్లాకు తొమ్మిదో స్థానం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసాధికార సర్వే పుష్కరాల కారణంగా నత్తనడకన సాగుతోంది. వీఆర్‌ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల ఉద్యోగులు పుష్కరాల విధుల్లో ఉండటం వల్ల సర్వే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు నిలిచిపోయింది. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరుగా జరుగుతోంది. గత నెల 8న ప్రారంభమైన సర్వే ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా సర్వేలో 9వ స్థానంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 2,52,624 కుటుంబాలకు సంబంధించి 8,51,378 మంది సభ్యులను సర్వే చేశారు. ఆర్బన్ ప్రాంతాల్లో 60,375 కుటుంబాల్లో 2,22,435 సభ్యులను సర్వే చేశారు. జిల్లా మొత్తంగా 3,12,999 కుటుంబాలకు చెందిన 10,73,813 మంది సభ్యుల వివరాలు నమోదు చేశారు. ఇంకా 6 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. పుష్కరాల తర్వాత సర్వే ఊపందుకునే అవకాశం ఉంది.
Advertisement
Advertisement