వైభవంగా శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం | siva parvathula agni gunda pravesham in roddam | Sakshi
Sakshi News home page

వైభవంగా శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం

May 13 2017 11:06 PM | Updated on Sep 5 2017 11:05 AM

వైభవంగా శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం

వైభవంగా శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం

మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రొద్దకాంబ రుద్రపాద 10వ జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం వైభవంగా జరిగింది.

రొద్దం : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రొద్దకాంబ రుద్రపాద 10వ జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రస్వామి వేషాదారుల వీరగాసే నృత్యాలు అందరిని అలరించాయి. వారు వివిధ విన్యాశాలతో భక్తులు విసిరే టెంకాయలు, నిమ్మకాయలను ఖడ్గంతో ఒకే దెబ్బకు కొడుతూ అందరిని ఆశ్చర్య పరిచారు. అనంతరం వారు నృత్యాలు చేస్తూ అశేష జనసందోహం మధ్య అగ్ని గుండ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ మున్నీర్‌అహ్మద్‌ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement