రొద్దం ఎంపీపీ రాజీనామా ! | roddam mpp resign | Sakshi
Sakshi News home page

రొద్దం ఎంపీపీ రాజీనామా !

Jun 13 2017 10:24 PM | Updated on Sep 5 2017 1:31 PM

రొద్దం టీడీపీ ఎంపీపీ బోయ అంజినమ్మ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

అనంతపురం సిటీ : రొద్దం టీడీపీ ఎంపీపీ బోయ అంజినమ్మ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి రామచంద్రకు రాజీనామా లేఖను అందజేశారు. తన వ్యక్తి గత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.  కుటుంబ సమస్యలతో పాటు ఇతర వ్యక్తిగత కారణాల వల్ల పదవికి న్యాయం చేయలేక పోతున్నానని చెప్పారు.

ఎంపీపీ అంజినమ్మ రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా? అని జెడ్పీ సీఈఓ రామచంద్రను ‘సాక్షి’ వివరణ కోరగా...అలాంటివేంలేవని ఆయన సమాధానమిచ్చారు. ఏవైనా అలాంటి కారణాలుంటే సభ్యురాలు తమకు ఫిర్యాదు చేస్తే చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వయంగా సభ్యురాలే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటానని రాత పూర్వకంగా రాజీనామా పత్రం ఇచ్చినందువల్ల ఆ లేఖను స్వీకరించి ఆమె రాజీనామాను ఆమోదించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement