అందరి చూపు ఆ కేఫ్ వైపే! | Show all the way to the cafe ! | Sakshi
Sakshi News home page

అందరి చూపు ఆ కేఫ్ వైపే!

Aug 21 2016 10:53 PM | Updated on Sep 4 2017 10:16 AM

అందరి చూపు ఆ కేఫ్ వైపే!

అందరి చూపు ఆ కేఫ్ వైపే!

నగరానికి చెందిన ‘ఫొటో వాకర్స్‌’ఇరానీ కేఫ్‌నే ఫోటో ఎగ్జిబిషన్‌కు వేదిక చేసుకున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: ఆర్ట్‌ గ్యాలరీలు అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉంటాయి. ఇక కాఫీడేలు, కల్చరల్‌ సెంటర్లలోని ఎగ్జిబిషన్‌ హాల్స్‌ సైతం ప్రముఖులకో, మేధావులకో అందుబాటులో ఉంటాయి. అక్కడ నిర్వహించే ఫొటో ప్రదర్శనలను తిలకించే అవకాశం సామాన్యులకు సు‘దూరమే’. ఈ దూరాన్ని చెరిపేయాలనుకున్నారు నగరానికి చెందిన ‘ఫొటో వాకర్స్‌’. సిటీ ఐడెంటిటీ సింబల్స్‌లో ఒకటైన ఇరానీ కేఫ్‌నే ఫోటో ఎగ్జిబిషన్‌కు వేదిక చేసుకున్నారు.

ఫొటో ఎగ్జిబిషన్స్‌ అనగానే ఏ గ్యాలరీ అనే ప్రశ్నే వస్తుంది. అయితే వీటిని సామాన్యులకు చేరువ చేయాలనే ట్రెండ్‌ ఇటీవలే మొదలైంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇవి ఇప్పటికే సామాన్యుడి ముంగిటకు వచ్చేశాయి. ఏకంగా బస్‌ స్టాపులు, రైల్వే స్టేషన్లు.. ఇలా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలను వెతికి మరీ ఎక్స్‌పోలను  ఆరెంజ్‌ చేస్తున్నారు. నగరానికి ఈ ట్రెండ్‌ని పరిచయం చేస్తూ ఎక్కువ జనాలు వచ్చే ఇరానీ కేఫ్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.  

సిటీ లుక్‌.. సిటిజన్స్‌ క్లిక్‌..
ఈనెల 19న అబిడ్స్‌లోని హోటల్‌ గ్రాండ్‌ ఇరానీ కేఫ్‌లో ఫొటో గ్రాఫర్స్‌ గ్రూప్‌ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నేటితో ముగియనుంది. మధ్య తరగతి, సామాన్య జనాన్ని అందుకునేందుకు సిటీలో తొలిసారిగా ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామని, నగరం నలుమూలల్నీ ప్రతిబింబించే ఫొటోలను, నగరవాసులే తీసిన నేపధ్యంలో ఈ ప్రదర్శనను ఏదైనా రద్దీగా ఉండే ప్లేస్‌లో పెట్టాలని అనుకున్నామని చెప్పారు నిర్వాహకులు. తాము ఆశించినట్టే గ్యాలరీల కన్నా మిన్నగా గంటకి కనీసం 50 నుంచి 70 మంది సందర్శకులు వీటిని వీక్షిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు.

స్పిరిట్‌ ఆఫ్‌ సిటీ..
ఈ ఎగ్జిబిషన్‌ కోసం ‘స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ టైటిల్‌తో ఫొటోలు పంపించాల్సిందిగా కోరామని, వందలాదిగా ఎంట్రీలు వచ్చాయని, అందులో నుంచి ప్రత్యేకమైన ఫొటోలను ఎంపిక చేసినట్టు హైదరాబాద్‌ ఫొటోగ్రాఫర్స్‌ క్యూరేటర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు. మన సిటీకి చెంది హైదరాబాద్‌ వీకెండ్‌ షూట్‌ టీం మెంబర్స్‌తో పాటు హైదరాబాద్‌ ఫొటో వాకర్స్‌.. వీకెండ్స్‌లో సిటీలో సంచరిస్తూ.. నచ్చిన దృశ్యాన్ని క్లిక్‌మనిపించిన వాటిలో నుంచి ఉత్తమ ఫొటోలను తీసుకున్నారు.

అజయ్‌ కుమార్‌ పాణిగ్రాహి, ఆశ సతీశ్, బాబీ చౌదరి, చంద్ర కూచిభొట్ల, దీపాలు శర్మ, ద్వారకానాథ్‌ కీర్తి.. ఇలా ఆ వీకెండ్‌ షూట్‌ టీంలోని 20 మంది టాప్‌ ఫొటోగ్రాఫర్ల ఎక్స్‌క్లూజివ్‌ ఫొటోస్‌ని ఈ ఇరానీ కేఫ్‌ ఎక్స్‌పోలో ఉంచారు. కామన్‌ పీపుల్‌ సైతం కేఫ్‌లోని ఇరానీ చాయ్‌ని ఆస్వాదిస్తూ ఫొటోగ్రాఫ్‌్సని చూస్తూ వాటి వెనక స్టోరీని తెలుసుకుంటూ.. ఫొటో గ్రాఫర్స్‌తో సెల్ఫీలు దిగుతూ కొత్త థ్రిల్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారని చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement