చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | Sakshi
Sakshi News home page

చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Published Tue, Aug 11 2015 10:40 PM

short cercuit in chennai express train

సింగరాయకొండ (ప్రకాశం): చెన్నై నుంచి  హైదరాబాద్ వెళుతోన్న చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బోగీల నిండా పొగలు వ్యాపించాయి. దీంతో రైలును ప్రకాశం జిల్లా సింగరాయకొండ స్టేషన్ లో అర్ధాంతరంగా నిలిపివేశారు.  అగ్నిప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యూట్‌ అని తేలింది.

కావలి స్టేషన్ దాటిన తర్వాత ఎస్ 9 బోగీ నుంచి పొగలు రావడాన్ని గమనించిన గార్డు..మంటలు మరిన్ని బోగీలకు వ్యాపించకుండా తర్వాతి స్టేషన్ అయిన సింగరాయకొండలో నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. ఆ తరువాత కొద్దిసేపటికి రైలు గమ్యస్థానం హైదరాబాద్ వైపు బయలుదేరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement