
వైభవంగా ఏడు శనివారాల వ్రతం
లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతాలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
అనంతపురం కల్చరల్ : లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతాలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం స్థానిక ఆర్‌ఎఫ్‌రోడ్‌లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఏడు శనివారాల వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏఎల్‌ఎన్ శాస్త్రి నేతృత్వంలో వందలాది మహిళలు సామూహిక వ్రతమాచరించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన అధిదేవతలైన శ్రీ లక్ష్మీ సహిత శ్రీ వెంకటేశ్వరస్వామికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.