దుర్గం మున్సిపాలిటీకి ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరు | sc subplan funds release of rayadurgam muncipality | Sakshi
Sakshi News home page

దుర్గం మున్సిపాలిటీకి ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరు

Jul 20 2017 10:26 PM | Updated on Jul 24 2018 2:22 PM

రాయదుర్గం మున్సిపాలిటీకి రూ. 1.97 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరయ్యాయి.

రాయదుర్గం అర్బన్‌ : రాయదుర్గం మున్సిపాలిటీకి రూ. 1.97 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.కృష్ణ గురువారం తెలిపారు. దళితుల సంక్షేమం పట్టని ప్రభుత్వ వైఖరిపై గత నెల 29న ‘నిర్లక్ష్యానికి పరాకాష్ట’ శీర్షికన సాక్షిలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. నివేదికలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబట్టుకున్నారు. మంజూరైన రూ. 1,97,79,000లో నుంచి రూ. 75.77 లక్షలతో తక్షణమే పనులు చేపట్టేందుకు  శాఖాపరమైన అనుమతులు కూడా ఇచ్చేశారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేసి, టెండర్లు సైతం పిలిచిన ఆరు పనులు తక్షణమే ప్రారంభించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement