కోనసీమలో ‘సర్వమంగళం’ | sarvamangalam movie shooting in konaseema | Sakshi
Sakshi News home page

కోనసీమలో ‘సర్వమంగళం’

Nov 15 2015 12:23 PM | Updated on Aug 9 2018 7:30 PM

కోనసీమలో ‘సర్వమంగళం’ - Sakshi

కోనసీమలో ‘సర్వమంగళం’

తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్వమంగళం’ పూర్తి కుటుంబ కథాచిత్రమని ఆ సినిమా డెరైక్టర్ ఛత్రపతి శివాజీరాజు చెప్పారు.

ఐ.పోలవరం : తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్వమంగళం’ పూర్తి కుటుంబ కథాచిత్రమని ఆ సినిమా డెరైక్టర్ ఛత్రపతి శివాజీరాజు చెప్పారు. చిత్రం అందరి మన్ననలు పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సర్వమంగళం’ చిత్రీకరణ గత రెండురోజులుగా మండలంలోని కేశనకుర్రుపాలెం గ్రామంలో జరుగుతోంది.
 
 ఈ సందర్భంగా శివాజీరాజు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా శ్రీనివాసరెడ్డి, పూర్ణ నటిస్తున్నారని తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు కోనసీమ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నారాయణరావు, వేణుగోపాల్, కృష్ణుడు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారని శివాజీరాజు చెప్పారు. కాగా గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్‌ను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారితో కేశనకుర్రుపాలెం సందడిగా కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement