ఆర్ట్స్‌ కళాశాలకు రూ.లక్ష విరాళం | rs.lakh donates to arts college | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాలకు రూ.లక్ష విరాళం

Sep 9 2016 12:10 AM | Updated on Sep 4 2017 12:41 PM

ఎండోమెంట్‌ క్యాష్‌ప్రైజ్‌ల కోసం రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ పి. మహమ్మద్‌ఖాన్‌ ఆర్ట్స్‌ కళాశాలకు రూ. లక్ష విరాళంగా అందజేశారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఎండోమెంట్‌ క్యాష్‌ప్రైజ్‌ల కోసం రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ పి. మహమ్మద్‌ఖాన్‌ ఆర్ట్స్‌ కళాశాలకు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఈయన ఈ కళాశాలలో 1964–67లో బీఎస్సీ బీజెడ్సీ గ్రూపులో చదివి, ఇదే కళాశాలలో 2000–03 మధ్య బాటనీ అధ్యాపకునిగా పని చేశారు. తర్వాత కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. తాను చదివిన, బోధించిన కళాశాల పట్ల అభిమానంతో ఈ విరాళం అందజేశారు.

తల్లిదండ్రులైన పి. మహబూబీ, పి. యూసుఫ్‌ఖాన్‌ జ్ఞాపకార్థం డిపాజిట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తంపై వచ్చే వార్షిక వడ్డీని మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాల బీఎస్సీ బాటనీ సబ్జెక్టులో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా అందజేయాలని కోరారు.  మహ్మద్‌ఖాన్‌ను  ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement