రౌడీషీటర్‌ హత్యకేసు...

కత్తి, గొడ్డలి, తల్వార్లు స్వాధీనం వివరాలు తెలుపుతున్న సీపీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ - Sakshi


ఆరుగురు నిందితుల అరెస్టు

మారణాయుధాలు స్వాధీనం

భూవివాదంలో తలదూర్చినందుకే హత్య  




గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని ఉదయ్‌నగర్‌లో ఆగస్టు 27వ తేదీ న రౌడీషీటర్‌ ఆరుకోళ్ల శ్రీనివాస్‌ ఉరఫ్‌ బుగ్గల శ్రీనును దారుణంగా హత్య చేసిన ఆరుగురు నిందితులను గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వారి  నుంచి కత్తి, గొడ్డలి, మూడు తల్వార్లతోపాటు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సీపీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ వివరాలు వెల్లడించారు. గోదావరిఖని ఐబీకాలనీ (ప్రస్తుతం ప్రశాంత్‌నగర్‌)లో నివాసముండే పెద్ది రవిశంకర్‌ మంచిర్యాలలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. గోదావరిఖని రాంనగర్‌కు చెందిన కొలిపాక చంద్రయ్య, పవర్‌హౌస్‌కాలనీకి చెందిన రాజయ్య తోడుకావడంతో మంచిర్యాలలోని గరిమిల్ల శివారులోని సున్నంబట్టి ఏరియాలో 2014లో సర్వేనెంబర్‌ 466లో ఎకరం తొమ్మిది గుంటల స్థలాన్ని తలా రూ.10 లక్షల చొప్పున వెచ్చించి రూ.30 లక్షలతో మంచిర్యాల (ప్రస్తుత నివాసం మహదేవపూర్‌)కు చెందిన కటికనేని విజయ వద్ద కొనుగోలు చేశారు. అయితే విజయ బంధువు అయిన సరోజన అప్పటికే ఆ స్థలాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయడంతో వివాదం ఏర్పడింది. ఆ స్థలం రవిశంకర్, అతడి పార్ట్‌నర్లు అయిన చంద్రయ్య, రాజయ్యల పేర్లపై రిజిస్ట్రేషన్‌ కాలేదు. దీంతో వీరు మంచిర్యాల ఆర్డీవో, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో ఇచ్చిన డబ్బు ఇవ్వాలని కొలిపాక చంద్రయ్య పెద్దిరవిశంకర్‌పై ఒత్తిడి తెచ్చాడు. సతాయించగా బుగ్గల శ్రీనును సంప్రదిం చాడు. ఆరునెలల్లో ఇంటిని అమ్మి చంద్రయ్య డబ్బు ఇవ్వాలని రవిశంకర్‌తో నోటరీ రాయించాడు. అయితే గడువు పెట్టిన ఆరునెలల సమయం సమీపిస్తుండడంతో పెద్ది రవిశంకర్‌ను పిలిపించి డబ్బు సిద్ధం చేసుకోవాలని దాంతోపాటు ఈ సమస్యను పరిష్కారం చేసినందుకు తనకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని పిస్టల్‌ చూపించి బెదిరించాడు. రవిశంకర్‌ వద్ద డబ్బు లేకపోవడంతో  శ్రీనివాస్‌ను చంపడమే పరిష్కారమని భావించి అతడిని హత్య చేశారని సీపీ  తెలిపారు.



పట్టుబడింది ఇలా

హత్య అనంతరం ఆటోలో మంచిర్యాల జిల్లా గుడిపేటలో రవిశంకర్‌ స్నేహితుడు ప్రభాకర్‌ వద్దకు వెళ్లగా అతను పోలీసులకు లొంగిపోవాలని సూచిం చాడు. అదే ఆటోలో ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామ శివారులోని చెట్ట పొదల్లో రక్తం అంటిన దుస్తులు, మారణాయుధాలను దాచిపెట్టి తిరిగి ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న గోదావరిఖ ని వన్‌టౌన్‌ సీజి.కృష్ణ, ఎస్సై రమేశ్‌బాబు సిబ్బం దితో ఈనెల7వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడే ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందరు పాత నేరస్తులే కావడం గమనార్హం. నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌ పరుస్తున్నట్లు సీపీ దుగ్గల్‌ తెలిపారు. విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top