తూర్పుగోదావరి జిల్లాలోని జొన్నాడ వంతెనపై శనివారం ప్రమాదం జరిగింది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని జొన్నాడ వంతెనపై శనివారం ప్రమాదం జరిగింది. అంబులెన్స్ అదుపుతప్పి రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లోని వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర అనారోగ్యం పాలైన వ్యక్తిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా... ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అయితే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది.