వివాహలకు బియ్యం పంపిణీ | Rice distribution for marrages | Sakshi
Sakshi News home page

వివాహలకు బియ్యం పంపిణీ

Aug 23 2016 6:10 PM | Updated on Sep 4 2017 10:33 AM

వివాహలకు బియ్యం పంపిణీ

వివాహలకు బియ్యం పంపిణీ

చందుపట్ల(భువనగిరి అర్బన్‌) : పలు గ్రామాల్లోని పేద రైతుల కుమార్తెల వివాహాలకు చందుపట్ల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.

చందుపట్ల(భువనగిరి అర్బన్‌) : పలు గ్రామాల్లోని పేద రైతుల కుమార్తెల వివాహాలకు చందుపట్ల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని చీమలకొండూరు గ్రామానికి చెందిన మొలుగు రాములు కుమార్తె, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ వహిద్‌అలీ కుమార్తె, వీరవెల్లి గ్రామానికి చెందిన ఆముదాల నరేందర్‌రెడ్డి కుమార్తె, చందుపట్ల గ్రామానికి చెందిన దరకంటి చంద్రయ్య కుమార్తెల వివాహలకు  ఒక్కొక్క రైతు కుటుంబానికి 100 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్‌. భిక్షపతి, సీఈఓ దంతూరి నర్సింహ, డైరెక్టర్లు నీల పార్వతమ్మ, బిజ్జాల వెంకటే శ్వర్లు, అంగడి బుచ్చయ్య, నల్ల ఎల్లయ్య, లక్ష్మారెడ్డి, చిన్నం రాములు, పాపిరెడ్డి, సిబ్బంది నర్సింహ, రాములు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement