ఏలూరు రూరల్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను రెసిడెన్షియల్ కళాశాలలుగా మార్పు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు.
రెసిడెన్షియల్ కాలేజీలుగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్
Oct 29 2016 2:11 AM | Updated on Oct 22 2018 7:32 PM
ఏలూరు రూరల్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను రెసిడెన్షియల్ కళాశాలలుగా మార్పు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శుక్రవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన చంద్రన్న దళితవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో రూ.12 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కోట్ల రూపాయలతో ఎస్సీ వాడల్లో రోడ్లను సీసీ రహదారులుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. డీఆర్‌డీవో ద్వారా రూ. 6.75 కోట్లు, మెప్మా ద్వారా రూ. 5 కోట్ల విలువైన రుణాలను లబ్ధిదారులకు అందజేశారు.
డుమ్మా కొట్టిన ప్రజాప్రతినిధులు
మంత్రి సభకు స్థానిక ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. సభ ప్రాంగణానికి మంత్రి రావెల వచ్చి గంటల పాటు వేచి చూసినప్పటికీ ఎంపీ మాగంటి బాబు, ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్ రాలేదు. దీంతో ఆయన మంత్రి సుజాతతో కలిసి సభను అయ్యిందనిపించారు. ఎమ్మెల్సీ రాముసూర్యారావు, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, కలెక్టర్ కాటంనేని భాస్కర్, నగర మేయర్ షేక్ నూర్జ్జహాన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement