హైదరాబాద్ నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది.
హైదరాబాద్ నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు అందులో ఉన్న రూ. 13 లక్షల సూట్‌కేస్‌తో ఉడాయించారు. నూతనంగా తీసుకున్న భూమి రిజిస్ట్రేషన్ కోసం గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలమానికి వచ్చిన ఓ వ్యక్తి నగదును కార్లో ఉంచి కాగితాలు సిద్ధం చేసుకుంటుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.