చెరువులను నింపాలని అధికారులకు వినతి | realese water from sagar | Sakshi
Sakshi News home page

చెరువులను నింపాలని అధికారులకు వినతి

Aug 24 2016 10:38 PM | Updated on Sep 4 2017 10:43 AM

చెరువులను నింపాలని అధికారులకు వినతి

చెరువులను నింపాలని అధికారులకు వినతి

సాగర్‌ నీటి ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపాలని కోరుతూ బుధవారం ఎన్‌ఎస్‌పీ సీఈ సునీల్‌కుమార్‌ ఎస్‌ఈ అంజయ్యలకు వినతి పత్రం అందజేసినట్లుగా ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు తెలిపారు.

చిలుకూరు: సాగర్‌ నీటి ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపాలని కోరుతూ బుధవారం ఎన్‌ఎస్‌పీ సీఈ సునీల్‌కుమార్‌  ఎస్‌ఈ  అంజయ్యలకు వినతి పత్రం అందజేసినట్లుగా ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ  మాట్లాడుతూ  ఆర్‌కే మేజర్‌ ఓటి నుంచి 0.594 కిలోమీటర్‌ వద్ద నూతన తూము ద్వారా ఉన్న జాలు కాలువ నుంచి చిలుకూరు , నారాయణపురం ఊర  చెరువును నింపాలని,  ముక్యాల కాలువ 5ఎల్‌ నుంచి ఫీడర్‌ చానల్‌ ద్వారా సీతరాంపురం, పాలె అన్నారం చెరువులు,  మండలంలోని చెన్నారిగూడెం పరిధిలోని నరసింహులకుంట, రాముల కుంటకు , జెర్రిపోతులగూడెం, మొగిళ్ల కుంట చెరువును ప్రధాన కాలువ నుంచి∙జాలు కాలువ ద్వారా నింపాలని సంబంధిత అధికారులను కోరినట్లుగా తెలిపారు.  దాదాపుగా మండలంలోని అన్ని చెరువులను నింపేందుకు ఎన్‌ఎస్‌పీ ఆధికారుల సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో  మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, వైస్‌ ఎంపీపీ వట్టికూటి నాగయ్య చంద్రకళ,  బేతవోలు సోసైటీ చైర్మన్‌ బెక్కం లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్‌ బాదె,అంజనేయులు తదితరులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement