హనుమద్వాహనంపై శ్రీరంగనాథుడు | ranganatha swamy on hanuma vahana | Sakshi
Sakshi News home page

హనుమద్వాహనంపై శ్రీరంగనాథుడు

Apr 9 2017 11:12 PM | Updated on Sep 5 2017 8:22 AM

హనుమద్వాహనంపై శ్రీరంగనాథుడు

హనుమద్వాహనంపై శ్రీరంగనాథుడు

తర్తూరు శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజైన ఆదివారం శ్రీలక్ష్మీరంగనాథస్వామి హనుమంతుడి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

జూపాడుబంగ్లా : తర్తూరు శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజైన ఆదివారం  శ్రీలక్ష్మీరంగనాథస్వామి హనుమంతుడి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామివారిని పట్టువస్త్రాలతో అలంకరించారు. మల్లెలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు కూర్చుండబెట్టారు. అనంతరం గోవింద నామాన్ని స్మరిస్తూ వాహనాన్ని గ్రామ పురవీధుల్లో తిప్పారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారికి కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
 
నేడు గరుడ వాహనసేవ : స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం  గరుడ వాహన సేవను నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్‌ రాయపు చిన్నరంగారెడ్డిలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement