
వాన కురిసె..నీళ్లు నిలిచె
మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
జగదేవ్‌పూర్: మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిగుల్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు, మిష¯ŒS భగీరథ పనుల కారణంగా ప్రధాన వీధుల్లో మురికి కాల్వలు లేకుండాపోయాయి. వర్షం కురవడంతో నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో కొంత సేపు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే బీసీ కాలనీలో మురికి కాల్వలు నిండి నీళ్లు ఇళ్లలోకి చేరాయి. ఇళ్లలోని నీళ్లను బయటికి ఎత్తిపోసుకున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ నీళ్లు వెళ్లేందుకు మురికి కాలువలు ఏర్పాటు చేయాలని అధికారులను కొరారు.
వర్షంతో కూలిన ఇల్లు
వెల్దుర్తి: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కుప్ప కూలింది. ఈ సంఘటనలో కుటుంబ సభ్యులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది మండలంలోని యశ్వంతరావుపేటలో గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గురజాల పెద్దచంద్రాగౌడ్‌కు చెందిన పెంకుటిల్లు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసి గురువారం కూలింది. ఆ ఘటనకంటే పది నిమిషాల ముందు తన భార్య రాజమ్మ, కోడలు పావని, ముగ్గురు పిల్లలు ఆరు బయటకు రాగానే కుప్ప కూలిందని బాధితుడు తెలిపాడు. ఆ సమయంలో వారు ఇంట్లో ఉంటే ప్రాణాలు పోయేవన్నాడు. ఇల్లు కూలడంతో వస్తువులన్నీ సర్వ నాశనమయ్యాయని ఆదుకోవాలని కోరారు.