రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షంపడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షంపడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు 10 నుంచి 35 మిల్లీమీటర్లు (మి.మీ) మేర మోస్తరు నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 35 డిగ్రీలు, కనిష్టంగా 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 9 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
అక్కడక్కడ వర్షం
కాగా శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు పడ్డాయి. కంబదూరు, ధర్మవరం, హిందూపురం, అమరాపురం, శింగనమల, కూడేరు, గుడిబండ, బుక్కపట్టణం, రొద్దం, కొత్తచెరువు, పామిడి, వజ్రకరూరు, లేపాక్షి, పరిగి, పుట్టపర్తి, మడకశిర, పుట్లూరు, గార్లదిన్నె, అనంతపురం, సోమందేపల్లి, గుంతకల్లు, ఓడీ చెరువు, పెనుకొండ, కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.