పోడు భూముల విషయంలో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది.
అశ్వారావుపేట: పోడు భూముల విషయంలో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో లంకాయపల్లిలో ప్లాంటేషేన్ వేసేందుకు అటవీ అధికారులు మంగళవారం వచ్చారు. అయితే ఆ భూమిపై హక్కులు తమకు ఉన్నాయంటూ గిరిజనులు, అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఇంతలో అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.