పనులు నాణ్యంగా చేయాలి | Quality Work Need for Pushkar Ghats | Sakshi
Sakshi News home page

పనులు నాణ్యంగా చేయాలి

Jul 19 2016 11:03 PM | Updated on Sep 4 2017 5:19 AM

సోమశిల దగ్గర పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

సోమశిల దగ్గర పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌ రూరల్‌ : కృష్ణా పుష్కర ఘాట్ల పనులు వేగవంతంగా, నాణ్యంగా చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి, సోమశిలలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లు, రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.

కొల్లాపూర్‌ రూరల్‌ : కృష్ణా పుష్కర ఘాట్ల పనులు వేగవంతంగా, నాణ్యంగా చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి, సోమశిలలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లు, రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఘాట్ల ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. అనంతరం సోమశిల శివారులోని సోమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి కృష్ణయ్య, పీఆర్‌ ఈఈ రాములు, ఏఈ విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement