breaking news
Quality Work
-
50 ఏళ్లైనా చెక్కు చెదరని రోడ్డు
ఈ రోజు వేస్తే.. నెల రోజుల తరువాత గుంతలు. ఇది ఇటీవలి కాలంలో రోడ్ల దుస్థితి. కానీ.. ఆ రోడ్డు వేసిన 50 ఏళ్లకు కూడా చెక్కు చెదరలేదు. 35 ఏళ్ల తరువాత ఒక్కసారి మాత్రమే మళ్లీ తారు వేశారంతే. కేవలం పదేళ్ల వారంటీతో వేసిన రోడ్డు 50 ఏళ్లయినా రిపేరుకు రాకపోవడానికి కారణమేంటి? అసలు ఒక రోడ్డు అన్నేళ్లు గుంతలు పడకుండా ఎలా ఉంటుంది? వేసిన కొద్ది రోజులకే గుంతలు పడేలా రోడ్లేస్తున్న ప్రస్తుత కాంట్రాక్టర్లు, నేతల్ని సిగ్గు పడేలా చేస్తున్న ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఇవన్నీ తెలియాలంటే.. మీరు పుణేకి వెళ్లాల్సిందే. ఆ రోడ్డు.. పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్డు. దీన్ని బ్లాక్ పాంథర్ లైన్‌గా కూడా పిలుచుకుంటారు. 1976లో 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో వేశారు. వేసేనాటికి పదేళ్లుంటే చాలనుకున్నారు. కానీ.. కొత్తగా నిర్మించిన రోడ్లు, వంతెనలు కూలిపోతున్నప్పటికీ, దాదాపు 50 ఏళ్ల కిందట నిర్మించిన రోడ్డు మాత్రం ఒక ప్రత్యేకమైన పౌర ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. అయితే.. చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ.. 2014లో మరోసారి తారు వేశారు. పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డులో ప్రసిద్ధ రెస్టారెంట్లు, కొన్ని ముఖ్యమైన దేవాలయాలున్నాయి. రోడ్డు ఎంత బాగుంటుందంటే.. తమ యవ్వనంలో రాత్రి పూట రేస్ ట్రాక్‌గా ఉపయోగించుకునేవాళ్లమని చెబుతున్నారు స్థానికుడు 70 ఏళ్ల ఉపేంద్ర లక్ష్మేశ్వర్. ‘ప్రారంభించిన మూడు నెలలకే కర్ణాటకలోని రూ. 6.5 కోట్ల చిక్కోడి వంతెన కూలిపోయింది’, ‘ప్రారంభించిన మూడు నెలలకే ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు గుంతలు’, ‘గురుగ్రామ్‌లో రోడ్డు గుంతలో భారీ ట్రక్కు దిగబడింది’వంటి కని, వినిపిస్తున్న ఈ కాలంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలకు ఇదో మచ్చు తునక అంటారు అతని కొడుకు 40 ఏళ్ల సిద్ధార్థ్ లకేష్మశ్వర్. మిగిలిన రోడ్ల నిర్మాణంలో ఈ బ్లాక్ పాంథర్ లైన్ నిర్మాణాన్ని ఎందుకు అనుసరించలేదనేది స్థానికుల ప్రశ్న. విశ్వాత్మక్ గురుదేవ్ అని కూడా పిలుచుకునే జంగ్లి మహారాజ్ 1818లో బరోడాలో (ఇప్పుడు గుజరాత్‌లోని వడోదర) జన్మించారు. పుణేలోని శివాజీనగర్‌లో ఉన్న దట్టమైన భంబుర్డే అడవులలో ధ్యానం చేశారు. అక్కడే ఇప్పుడు రోడ్డు ఉంది. 1972లో మహారాష్ట్ర తీవ్రమైన కరువును ఎదుర్కొంది. ఆ తర్వాత 1973లో వరదలు పుణే రోడ్లను ధ్వంసం చేశాయి. అయితే ముంబై రోడ్లు మాత్రం ఆ వరదలను తట్టుకున్నాయి. అప్పట్లో 21 ఏళ్ల కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయిన శ్రీకాంత్ శిరోలే దీని గురించి ఆరా తీశారు. మన్నికైన రోడ్ల కోసం అధునాతన హాట్ మిక్స్ టెక్నాలజీని ఉపయోగించిన పార్సీ యాజమాన్యంలోని ముంబై కంపెనీ రెకొండో వేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. పుణేలోని రోడ్లను అదే కంపెనీకి అప్పజెప్పారు. రోడ్డు 10 సంవత్సరాల పాటు గుంతలు లేకుండా ఉంటుందని, ఆలోపు ఏవైనా మరమ్మతులు వస్తే ఎటువంటి ఖర్చు లేకుండా చేస్తామనే హామీతో వేశారు. 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డును 1976 జనవరి 1న ప్రారంభించారు. ఆ రోడ్డు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉంది. 2014లో పుణే స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా రోడ్డును పూర్తిగా మార్చారు. సైకిల్ ట్రాక్, విశాలమైన కాలిబాటలు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పని వేళలు కాదు.. నాణ్యత ముఖ్యం..
ముంబై: ఆఫీసులో ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. ప్రతి రోజు ఎంత నాణ్యమైన పని చేశామనేదే తనకు ముఖ్యమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు. తనకు పని, కుటుంబం రెండూ ప్రాధాన్యతాంశాలేనని ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు జీవితంలో తమ తమ ప్రాధాన్యతలను గుర్తెరిగి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వారానికి 90 గంటల వరకు పని చేయాలంటూ కొందరు, 50 గంటలలోపు చాలంటూ మరికొందరు కార్పొరేట్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆకాశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మార్గనిర్దేశం చేసేందుకు తమ కంపెనీ 1,000 మంది డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుందని అంబానీ చెప్పారు. జామ్‌నగర్‌లో 1 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) సర్విసుగా అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
టైమ్‌కు వచ్చి కూర్చుంటే సరిపోదు!.. అదే ఇంపార్టెంట్
చాలామంది ఉద్యోగులు.. కంపెనీ రూల్స్ ప్రకారం ఆఫీసులకు వచ్చామా.. ఏదో పని చేసి వెళ్లిపోయామా అన్నట్టు ఉంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, అలాంటి కాలక్షేపాలకు సంస్థలు చరమగీతం పాడుతున్నాయి. దీంతో కొత్త రూల్స్ పుట్టుకొచ్చాయి. ఆఫీసుకు సమయానికి వస్తే సరిపోదు, ఉన్నంత సేపు ఎంత క్వాలిటీ వర్క్ చేసావు అనేది ప్రధానమని 10 సంస్థల్లో 7 చెబుతున్నట్లు.. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'అప్నా.కామ్' అధ్యయనంలో వెల్లడించింది. యాజమాన్యం మెప్పు కోసం, గుర్తింపు కోసం మాత్రం కాకుండా చేస్తున్న పనిలో ఎంత వరకు నాణ్యత ఉందనేది ఇక్కడ ప్రధానమని స్పష్టమవుతోంది. సమయానికి ఆఫీసులకు వచ్చి పనిచేయకపోతే ఎవరికీ లాభం ఉండదు. కాబట్టి సంస్థలో కొంత వెనుకబడిన వారిని గుర్తించి వారికి శిక్షణ ఇప్పంచడం లేదా వారి పనిలో నాణ్యతను పెంచడానికి కావలసిన సదుపాయాలను అందించడం వంటికి సంస్థలు చేపట్టాయి. ఉద్యోగి నుంచి ఏమి రాబట్టుకోవాలనేది సంస్థకు తెలిసి ఉండటం ప్రధానమని అప్నా.కామ్ సర్వే ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీలు తమ ఉద్యోగులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. పని చేసిన వారికి మంచి ప్రోత్సాహాలను అందిస్తే.. తప్పకుండా మరింత అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని 77 శాతం యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: 'హనూమన్' ఏఐ గురించి ఆసక్తికర విషయాలు.. రోజూ సమయానికి ఆఫీసులకు వచ్చి, విరామం తీసుకోకుండా, సెలవులు పెట్టకుండా పనిచేయాలనే సంస్థలు మంచి ఫలితాలను పొందవని, దీనికి భిన్నమైన సంస్కృతిని పెంపొందించడానికి సంస్థలకు కూడా పాటుపడాలని సర్వేలో తెలుసుకున్నట్లు అప్నా కో ఫౌండర్ అండ్ సీఈఓ సీఈవో నిర్మిత్ పరీఖ్ తెలిపారు. -
పనులు నాణ్యంగా చేయాలి
కొల్లాపూర్ రూరల్ : కృష్ణా పుష్కర ఘాట్ల పనులు వేగవంతంగా, నాణ్యంగా చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్ మండలంలోని అమరగిరి, సోమశిలలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లు, రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఘాట్ల ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. అనంతరం సోమశిల శివారులోని సోమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి కృష్ణయ్య, పీఆర్ ఈఈ రాములు, ఏఈ విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.