వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం | Pushkarni baths students and families YSR Congress financial aid | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం

Aug 25 2016 2:51 AM | Updated on Nov 9 2018 4:10 PM

వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం - Sakshi

వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం

పుష్కర స్నానాలకెళ్లి మృతిచెందిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని నేతలు బుధవారం అందజేశారు.

‘దిడుగు’ మృతుల కుటుంబాలకు  రూ.లక్ష చొప్పున అందజేత

 చందర్లపాడు: పుష్కర స్నానాలకెళ్లి మృతిచెందిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని నేతలు బుధవారం అందజేశారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన ములకలపల్లి హరీశ్, నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన పాశం గోపిరెడ్డి, నందిగామకు చెందిన కమ్మవరపు హరిగోపి, కూచి లోకేశ్, వీరులపాడు మండలం జయంతి గ్రామవాసి నందిగామ నగేష్‌లు ఇటీవల గుంటూరు జిల్లాలోని దిడుగు గ్రామం వద్ద పుష్కరస్నానాలకు వెళ్లి మృత్యువాత పడడం తెలిసిందే.

కాగా పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌లు బుధవారం మృతుల కుటుంబాలను కలసి వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఈ ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement