పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలి | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలి

Published Thu, Sep 1 2016 11:52 PM

వారోత్సవాల్లో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీదేవి

జడ్చర్ల : అంగ¯Œæవాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతల, కిశోర బాలికలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ టీకే శ్రీదేవి కార్యకర్తలకు ఆదేశించారు. గురువారం బాదేపల్లి పాతబజార్‌లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పోషకాహార వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆహార  అ లవాట్లపై సూచనలు చేశారు. మహిళలు వయసుకు తగ్గట్టు బరువు ఉండాలని, అంగ¯Œæవాడీల్లో ఉండే బా లామతం చిన్నారుల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పుట్టిన పిల్లలనుంచి 6 మాసాల వరకు తల్లి పాలు పట్టించడం శ్రేయస్కరమని, తల్లి పాలతో పిల్లలకు రోగనిరోదశక్తి పెరుగుతుందన్నారు. పిల్లల కడుపులో నులిపురుగుల నివారణకు మందులు అందుబాటులో ఉంచామని, ప్రతినెల వేయించే టీకాలను వైద్యులు సూచించిన తేదీల వారీగా నిర్ణీత కాలంలో వేయించాలని కోరారు. 
ఏలోటూ రానివ్వొద్దు 
అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కార్యకర్తలు ఏ లోటూ రానివ్వకుండా చూసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పౌష్టికాహారంతో పాటుగా ఆట వస్తువులను అందుబాటులో ఉంచాలని, దీంతో పిల్లల మెదడు ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. బాలింతలు, గర్భిణులకు ఎలాంటి శారీరక, ఆరోగ్య సమస్యలున్నా సమీప అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని కోరారు. గర్భిణుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రక్తహీనతకు అవకాశం లేకుండా చూడాలని, మేనరికం పెళ్లిళ్లు జరుగకుండా చూడాలని ఆరోగ్య కమిటీలు, మదర్స్‌ కమిటీలను కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ జోస్న, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగారం, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీదర్‌రెడ్డి, జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, సీహెచ్‌ఓ మల్లికార్జునప్ప, తహసీల్దార్‌ జగదీశ్వర్‌రెడ్డి, సీడీపీఓ ప్రవీణ పాల్గొన్నారు.
 
 
 

Advertisement
Advertisement