విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో మరోసారి ఖాకీలు రెచ్చిపోయారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరించారు. విధుల్లో ఉన్న ఉంగుటూరు తహశీల్దార్ శ్రీనివాస్పై సీఐ దురుసుగా ప్రవర్తించారు.
విజయవాడ: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో మరోసారి ఖాకీలు రెచ్చిపోయారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరించారు. విధుల్లో ఉన్న ఉంగుటూరు తహశీల్దార్ శ్రీనివాస్పై సీఐ దురుసుగా ప్రవర్తించారు. వీఐపీ గేటు వద్ద సీఐ అప్పలస్వామి తహశీల్దారు శ్రీనివాస్ను తోసేశాడు. దీంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.