దేవరపల్లి : దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద పోలవరం కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు.
పోలవరం కాలువలో పడి వ్యక్తి మృతి
Aug 13 2016 1:03 AM | Updated on Oct 4 2018 5:44 PM
దేవరపల్లి : దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద పోలవరం కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం కొత్తగూడెంకు చెందిన గండ్రోతు చినచంద్రరావు(60) గురువారం పుష్కరస్నానానికని ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి పొద్దుపోయినా తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం పోలవరం కుడి కాలువలో మృతదేహం ఉన్నట్లు తెలియడంతో చినచంద్రరావు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూడగా.. ఆయన మృతదేహం కనిపిం చింది. వారి ఫిర్యాదు మేరకు చినచంద్రరావు ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెంది నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు తెలిపారు.
Advertisement
Advertisement