పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి | pilgrims at pushkar ghats | Sakshi
Sakshi News home page

పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి

Aug 1 2016 9:58 PM | Updated on Sep 4 2017 7:22 AM

పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి

పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి

అంత్య పుష్కరాల రెండో రోజు సోమవారం భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు.

బాల్కొండ/మోర్తాడ్‌/రెంజల్‌ : అంత్య పుష్కరాల రెండో రోజు సోమవారం భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రంలో 2, 4 ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. నదిలోని పురాతన శివాలయం వద్ద భక్తులు పూజలు చేశారు. మోర్తాడ్‌ మండలంలోని తడపాకల్, బాల్కొండ మండలంలోని ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద కూడా సోమవారం సందడి కనిపించింది. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లకు భక్తులు తరలివచ్చారు. సమీపంలోని కోదండ రామాలయంలో పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో రెండో రోజూ నవ చండీ యాగం కొనసాగింది.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement