లారీ ఢీకొని పాదచారి దుర్మరణం | Pedestrian killed in lorry collided | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని పాదచారి దుర్మరణం

Feb 26 2017 3:39 AM | Updated on Sep 5 2017 4:35 AM

లారీ ఢీకొని పాదచారి దుర్మరణం

లారీ ఢీకొని పాదచారి దుర్మరణం

రోడ్డు పక్కన నడచి వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.

మదనపల్లె క్రైం: రోడ్డు పక్కన నడచి వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున మదనపల్లె పట్టణం కదిరి రోడు్డలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం పి అండ్‌ టి (పోస్టల్, టెలికం) కాలనీలో నివాసముంటున్న  శివనారాయణ(47) ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సత్యవతి, కుమారులు భానుప్రకాష్, హరిప్రకాష్‌ ఉన్నారు. నీరుగట్టువారిపల్లె సమీపంలోని ఓ ఇటుక బట్టీకి గురువారం అర్ధరాత్రి వరకు ట్యాంకర్‌తో నీరు తోలాడు. పని ముగించుకుని శుక్రవారం వేకువజామున నడచుకుంటూ ఇంటికి బయలుదేరాడు.

కదిరి రోడ్డు మసీదు కాంప్లెక్స్‌ సమీపంలో వెళుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న శివనారాయణను గమనించిన స్థానికులు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే క్షతగాత్రున్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో తిరుపతికి తరలిస్తుండగా భాకరాపేట వద్ద శివనరాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శివనారాయణ మృతి చెందడంతో ఇక మాకు దిక్కెవరంటూ భార్యా, పిల్లలు చేస్తున్న రోదనలు చూసి స్థానికులు కంటతడి పెటా్టరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement