ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పూల పెద్దిరెడ్డి, బి.నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పూల పెద్దిరెడ్డి, బి.నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుక సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. గుంటూరులోని కొరటాల భవన్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు.
పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేస్తూ జారీ చేసిన జీఓ 271 రద్దుచేయాలని, వెనుకబడిన రాయలసీమలో హంద్రీనీవా, గాలేరి–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు రూ. 6వేల కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 5వేల కోట్లు మంజూరు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు.