ఈనెల 25న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 600 మందికి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు.
సాధారణ, రీ యిష్యూ పాస్‌పోర్ట్‌లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, తత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులు స్వీకరించమని తెలిపారు. www.passportindia.gov.in వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్‌లు నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం (నేడు)నుంచి స్లాట్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.