పంచాయతీల్లో అక్రమాలను సమర్థిస్తారా? | panchayathi corruption issue | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో అక్రమాలను సమర్థిస్తారా?

Feb 4 2017 11:38 PM | Updated on Sep 22 2018 8:25 PM

అభివృద్ధి పేరుతో పంచాయతీల్లో జరుగుతున్న అవినీతికి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండగా ఉంటే ప్రతిపక్షం చూస్తూ కూర్చోదని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నేత కందుల దుర్గేష్‌ హెచ్చరించారు. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల గోల్‌మాల్‌పై తమ

  • మూడేళ్లయినా ఇంకా బురద జల్లే ప్రయత్నమా?
  • విజిలె¯Œ్సకు ఫిర్యాదు చేస్తే భుజాలు తడుముకుంటారెందుకు?
  •  ‘పోలవరం’ జాతీయ ప్రాజెక్టని విభజన చట్టంలోనే ఉంది
  • సాక్షి, రాజమహేంద్రవరం: 
    అభివృద్ధి పేరుతో పంచాయతీల్లో జరుగుతున్న అవినీతికి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండగా ఉంటే ప్రతిపక్షం చూస్తూ కూర్చోదని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నేత కందుల దుర్గేష్‌ హెచ్చరించారు. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల గోల్‌మాల్‌పై తమ పార్టీ విజిలె¯Œ్స విభాగానికి ఫిర్యాదు చేస్తే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించడం సీనియర్‌ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్యకు తగదన్నారు.  మూడేళ్లలో ఇసుక, మట్టి ఇలా ప్రతి పనిలో అవినీతి జరిగిందని ప్రజలే చెబుతున్నారన్నారు ఇప్పటికైనా అవినీతిపై విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని, లేదంటే ప్రజలతో కలసి వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. అనధికార లే అవుట్లపై నిబంధనల ప్రకారం పన్ను వసూలు చే సి చూపించాలన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నిబంధనల ప్రకా రం అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే చందన రమేష్‌కు ప్రాధాన్యం ఇచ్చానని, రూరల్‌ నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో ఒక్క అభివృద్ధి పనైనా చేశానని పేర్కొన్నారు. కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ రాకపోయినా ఎంపీలు ఏదో వచ్చినట్లు జబ్బలు చరుచుకుంటున్నారని దుర్గేష్‌ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ విభజన చట్టంలోనే ఉందన్న విషయం సీనియర్‌ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్యకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్‌ పూనుకోకపోతే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేవా అని ప్రశ్నించారు.   సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, కాతేరు మాజీ సర్పంచ్‌ అచంట సుబ్బారాయుడు, నేతలు మెండా సత్తులు, సీతారం, రామకృష్ణ, నరేంద్ర, కర్రి నాయుడు, సప్పా చిన్నారావు, బ్రహ్మాజీరావు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement