ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఓయూ శతాబ్ది ఉత్సవాలు | Osmania Celebrations | Sakshi
Sakshi News home page

ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఓయూ శతాబ్ది ఉత్సవాలు

May 5 2017 11:22 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ, ఉర్దూ అకాడమీ సౌజన్యంతో పలు సాంస్కృతిక


సాక్షి సిటీబ్యూరో: ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ, ఉర్దూ అకాడమీ సౌజన్యంతో పలు సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌ఎ షుకూర్‌ తెలిపారు. గురవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉర్దూలో పలు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు కోసం మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్‌ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగిందన్నా రు.

మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ఉర్దూ కవులు, రచయితలు పాల్గొన్న ఈ సమావేశంలో ఉర్దూ భాషలో రెండు సెమినార్‌లు, ముషాయిరాలు, గజల్‌ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి నట్టు తెలిపారు. అలాగే వివిధ విభాగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఓయూ పూర్వ విద్యార్థులకు ఉస్మాన్‌ అలీ పాషా పేరుతో అవార్డులు అందిస్తామన్నారు. రంజాన్‌కు ముందే వీటిని ఇస్తామని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement