మాటవరసకు కానే కాదు... పరమార్థం కోసమే | Opposition paries attack on KTR words | Sakshi
Sakshi News home page

మాటవరసకు కానే కాదు... పరమార్థం కోసమే

Jan 10 2016 5:00 AM | Updated on Aug 30 2019 8:24 PM

మాటవరసకు కానే కాదు... పరమార్థం కోసమే - Sakshi

మాటవరసకు కానే కాదు... పరమార్థం కోసమే

తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారకరామారావు అన్నారంటే విన్నవారంతా ముక్కున

తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారకరామారావు అన్నారంటే విన్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. మాట్లాడితే తెలంగాణ అంటూ ఒకటికి పదిసార్లు ఉచ్చరించే కేటీఆర్ నోట ఈ మాట రావడమేమిటని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోయారు. అయితే, కేటీఆర్ ఆషామాషీగా ఈ మాటలు అనలేదు. టీఆర్‌ఎస్ తెలుగు రాష్ట్ర సమితి అని పేర్కొన్నా, భీమవరం నుంచి పోటీ చేస్తానని అన్నా అదేమీ తేలిగ్గా అన్నది అస్సలు కాదు...గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే పరమావధిగా ఆయన ఈ మాటలన్నీ అనేశారు.

అయితే, ప్రతిపక్షాలు ఊరుకుంటాయా వారికీ ఎన్నికలు కావాలి కదా...జాగో బాగో ఏమైంది...తెలంగాణ తీసేసి తెలుగు పెడతావా అంటూ విమర్శలు గుప్పించారు. దాంతో ఇబ్బందిపడ్డారో ఏమో కేటీఆర్ అబ్బే ఏదో సరదాకు అన్న మాటలను పట్టుకుని రాజకీయం చేస్తారా అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది...గ్రేటర్ ఎన్నికల్లో ఇక ముందు ఇంకెన్ని మాటలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement