జిల్లాలోని సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు పరిధిలో మండలాల్లో పని చేస్తున్న జిల్లా కంప్యూటర్ ఆపరేటర్లు, మండల ఎంఐ ఎస్ సమన్వయకర్తలు, కంప్యూటర్ ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేశారు.
ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
Sep 24 2016 12:51 AM | Updated on Sep 4 2017 2:40 PM
	విద్యారణ్యపురి : జిల్లాలోని సర్వశిక్షాభియాన్  ప్రాజెక్టు పరిధిలో మండలాల్లో పని చేస్తున్న జిల్లా కంప్యూటర్ ఆపరేటర్లు, మండల ఎంఐ ఎస్ సమన్వయకర్తలు, కంప్యూటర్ ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేశారు. 
	 
					
					
					
					
						
					          			
						
				
	జీవో 19 ప్రకా రం పీఏబీ 2016–2017లో తమ వేతనాలు పెంచాల్సి ఉండగా అమలు చేయటం లేదన్నారు. ఎంఐఎస్ కో ఆర్డినేటర్లకు రూ.17,500 వరకు, ఆపరేటర్లకు రూ.15,500 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ నేటికి వేతనాలు పెంచలేదన్నారు. పది రోజుల్లో మా సమస్యలను పరిష్కరించాలని లేనిఝెడలఆందోళను ఉధృతం చేస్తామన్నాని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని సర్వశిక్షాభిమాన్  జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.తిరుపతిరావుకు విన్నవించి వినతిపత్రంను అందజేశారు. కా ర్యక్రమంలో ఆ ఆపరేటర్ల సంఘం బాధ్యులు కె.కార్తీక్, వై.మల్లేశం, కె.కొమురయ్య, వెంకటేశ్వర్లు, వేణు, అబ్బసాయిలు, శ్రీనివాస్, యాక న్న, తదితరులు పాల్గొన్నారు.   
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
