breaking news
solve the
-
ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
విద్యారణ్యపురి : జిల్లాలోని సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు పరిధిలో మండలాల్లో పని చేస్తున్న జిల్లా కంప్యూటర్ ఆపరేటర్లు, మండల ఎంఐ ఎస్ సమన్వయకర్తలు, కంప్యూటర్ ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేశారు. జీవో 19 ప్రకా రం పీఏబీ 2016–2017లో తమ వేతనాలు పెంచాల్సి ఉండగా అమలు చేయటం లేదన్నారు. ఎంఐఎస్ కో ఆర్డినేటర్లకు రూ.17,500 వరకు, ఆపరేటర్లకు రూ.15,500 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ నేటికి వేతనాలు పెంచలేదన్నారు. పది రోజుల్లో మా సమస్యలను పరిష్కరించాలని లేనిఝెడలఆందోళను ఉధృతం చేస్తామన్నాని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సర్వశిక్షాభిమాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్.తిరుపతిరావుకు విన్నవించి వినతిపత్రంను అందజేశారు. కా ర్యక్రమంలో ఆ ఆపరేటర్ల సంఘం బాధ్యులు కె.కార్తీక్, వై.మల్లేశం, కె.కొమురయ్య, వెంకటేశ్వర్లు, వేణు, అబ్బసాయిలు, శ్రీనివాస్, యాక న్న, తదితరులు పాల్గొన్నారు. -
విద్యా సమస్యలపై మహాధర్నా
గద్వాల : విద్యారంగంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నామని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి యూనస్‌పాష తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో మహాధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని, ఆంగ్ల మాధ్యమంలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు లక్ష్మణ్, విజయభాస్కర్‌రెడ్డి, కిషోర్‌చంద్ర, హుసేన్, రాజేష్, నాగరాజు, భీమన్న, శ్రీహరి, గౌరీశంకర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.