కావలిఅర్బన్ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు క్షేత్రస్థాయిలో తగినంత ప్రచారంలేదని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు అసంతప్తి వ్యక్తంచేశారు.
పథకాలపై ప్రచారంలేదు
Jul 29 2016 12:06 AM | Updated on Oct 20 2018 6:19 PM
సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి శిద్దా
కావలిఅర్బన్ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు క్షేత్రస్థాయిలో తగినంత ప్రచారంలేదని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు అసంతప్తి వ్యక్తంచేశారు. గురువారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయ కమిటీ జరిగింది. ఇందులో పాల్గొన్న శిద్దా మాట్లాడుతూ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సక్రమంగా అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కషిచేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, పార్టీ పరిశీలకులు గూడూరు ఎరిక్సన్ బాబు, నాయకులు పాలడుగు రంగారావు, తాళ్లూరు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement