కొత్త నోట్లొచ్చాయ్‌ | newnotes coming | Sakshi
Sakshi News home page

కొత్త నోట్లొచ్చాయ్‌

Nov 24 2016 12:45 AM | Updated on Sep 4 2017 8:55 PM

సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : చిల్లర నోట్ల కొరత కారణంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న నగదు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు రూ.500 కొత్తనోట్లు జిల్లాకు చేరాయి.

సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : చిల్లర నోట్ల కొరత కారణంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న నగదు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు రూ.500 కొత్తనోట్లు జిల్లాకు చేరాయి. వాటిని అన్ని బ్యాంకులకు గురువారం నుంచి పంపిణీ చేసే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. శుక్రవారం నుంచి ఈ కొత్త నోట్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుంటే.. నగదు కోసం బ్యాంకులకు వెళ్లే ఖాతాదారుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏటీఎంలలోఎప్పటికప్పుడు నగదు పెడుతున్నప్పటికీ తక్కువగానే ఉండటంతో క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి. ఎక్కువచోట్ల రూ.2,000 నోట్లు మాత్రమే వస్తుండటంతో వాటిని మార్చుకునేందుకు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లోని బ్యాంకులకు రోజుకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు మాత్రమే నగదు ఇస్తుండటంతో మధ్యాహ్నం 2 గంటలకే అయిపోతున్నాయి. 
ఆగని మోసాలు
మరోవైపు బ్యాంకుల వద్ద మోసాలు ఆగటం ఉన్నాయి. నల్లజర్ల మండలం అనంతపల్లి ఆంధ్రాబ్యాంక్‌ నుంచి వెలగాని రమణ అనే వ్యక్తి బుధవారం రూ.10 వేలు డ్రా చేసి తీసుకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి లాక్కుపోయాడు. ఇదిలావుంటే.. చిరు వ్యాపారుల ఇబ్బందులు మరింత తీవ్రతరమయ్యాయి. ముఖ్యంగా పండ్ల వ్యాపారులు చిల్లర నోట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. బుధవారం నుంచి వ్యాపారాన్ని నిలిపివేశారు. మరోవైపు పౌల్ట్రీ రంగం కుదేలైంది. ఈ సీజ¯ŒSలో రూ.4కు పైగా ఉండాల్సిన గుడ్డు ధర ప్రస్తుతం రూ.3.45 పలుకుతోంది. నిల్వ ఉంచలేని స్థితిలో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. 
స్కాలర్‌ షిప్పులు 
అందక అవస్థలు
బ్యాంకుల్లో నగదు నిల్వలు పెద్దగా ఉండకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి స్కాలర్‌ షిప్‌లు అందటం లేదు. కాలేజీ యాజమాన్యాలు వారం రోజులుగా విద్యార్థులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నాయి బ్యాంకుల్లో నగదు లేదని చెబుతుండటంతో వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. భవన నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోవడంతో కూలీలు, మేస్రీ్తలు ఆందోళన చెందుతున్నారు. ఎలక్రీ్టషియన్లు ఇబ్బంది పడుతున్నారు. నెలాఖరు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వ అధికారుల్లో గుబులు మొదలైంది. ఉద్యోగుల వేతనాలను డిసెంబర్‌ 1 నాటికి బ్యాంకుల్లో నేరుగా జమ చేసినా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 3.75 లక్షల మందికి రూ.50 కోట్లను పింఛన్ల రూపంలో అందించాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ ఎలా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే ఇబ్బందులు కొంతమేరకు తగ్గుతాయని ఆశిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement