మహేష్‌కు నెహ్రూ పురస్కారం | nehru award for mahesh | Sakshi
Sakshi News home page

మహేష్‌కు నెహ్రూ పురస్కారం

Nov 27 2016 11:29 PM | Updated on Sep 4 2018 5:24 PM

మహేష్‌కు నెహ్రూ పురస్కారం - Sakshi

మహేష్‌కు నెహ్రూ పురస్కారం

మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చిన్నారి మహేష్‌కు చాచా నెహ్రూ పురస్కారం లభించింది.

మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చిన్నారి మహేష్‌కు చాచా నెహ్రూ పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య కళామందిరంలో ఆదివారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, హైకోర్టు న్యాయమూర్తి ఏ.వి.శేషసాయి,  లక్ష్మిపార్వతి.. తదితర ప్రముఖుల చేత అవార్డు అందుకున్నాడు. బండిఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేట గ్రామానికి చెందిన మద్దిలేటి కుమారుడు వెంకటాపురం మహేష్‌ చిన్నతనంలోనే ఈతలో ప్రావీణ్యం చూపిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని ఎఫ్‌ ఎస్‌ సూర్యనారాయణ మాస్టర్‌ స్థాపించిన ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధులుగా వచ్చిన వారు అవార్డును అందించినట్లు  మహానందీశ్వర పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌ను పాఠశాల  కరస్పాండెంట్‌తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement