‘నయీం’ సినిమా షురూ
తుళ్లూరు రూరల్ (గుంటూరు): మాఫియా డాన్ ‘నయీం’ జీవిత కథ ఆధారంగా ‘ఖయీం భాయ్’ సినిమా ప్రారంభమైంది. పీ వెంకట్‌రెడ్డి, ఏ ప్రభాకర్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను డాక్టర్ అంబేద్కర్, తపస్సు సినిమాల దర్శకుడు భరత్ తీస్తున్నారు.
-
రాజధానిలో ‘ఖయీం భాయ్’ పేరుతో సినిమా ప్రారంభం
-
క్లాప్ కొట్టిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
-
స్విచాన్ చేసి ప్రారంభించిన గుంటూరు కలెక్టర్
తుళ్లూరు రూరల్ (గుంటూరు): మాఫియా డాన్ ‘నయీం’ జీవిత కథ ఆధారంగా ‘ఖయీం భాయ్’ సినిమా ప్రారంభమైంది. పీ వెంకట్‌రెడ్డి, ఏ ప్రభాకర్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను డాక్టర్ అంబేద్కర్, తపస్సు సినిమాల దర్శకుడు భరత్ తీస్తున్నారు. రాజధాని అమరావతి తాత్కాలిక సచివాలయం సమీపంలోని మందడం గ్రామం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్ కొట్టగా... గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ స్విచాన్ చేశారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాలో ‘నయీం’ కేరక్టర్ పాత్రను మందడం గ్రామానికి చెందిన కట్టా రాంబాబు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నయీం పేరు రాంబోగా పిలుస్తారు. స్థానిక గణేష్ విగ్రహం ఎదుట నయీం కేరక్టర్ అయిన రాంబాబు కొబ్బరికాయ కొట్టి నృత్యం చేస్తుండగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో కథానాయికగా బెంగళూరుకు చెందిన మౌని, తనికెళ్ల భరిణి, ఎల్బీ శ్రీరాం, బెనర్జీ, రాం జగన్, ఫిష్ వెంకట్, శివ సత్యనారాయణ, హేమ, ప్రగతి, జ్యోతి, ముమైత్‌ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు గోపి మోహన్, సంగీతం శేఖర్ చంద్ర, కెమెరామన్ శ్రీధర్‌నార్ల, మేకప్ సూర్యచంద్ర, కాస్ట్యూమ్ వలి, కో–డైరెక్టర్ పీవీ రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ క్రిష్ణారెడ్డి, జేవీ నారాయణరావు వ్యవహరిస్తున్నట్లు చిత్ర నిర్వహకులు తెలియజేశారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఏపీ రాజధాని ప్రాంతంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్‌లోని పాతబస్తీ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలియజేశారు.