ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగింపు | Narayankhed By Elections Nominations closed today | Sakshi
Sakshi News home page

ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగింపు

Jan 27 2016 10:19 AM | Updated on Aug 14 2018 2:50 PM

మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది.

మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్న సంజీవరెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి పాల్గొనున్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కిష్టారెడ్డి విజయం సాధించారు. ఆయన గతేడాది గుండెపోటుతో మరణించారు. దీంతో నారాయణ్ఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. నారాయణ్ఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement