సిద్దిపేటలోనే నంగునూరు మండలం | nangunuru mandal in siddipeta only | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలోనే నంగునూరు మండలం

Sep 24 2016 5:28 PM | Updated on Sep 4 2017 2:48 PM

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగుతుంది.. ఎవరి మాటలు నమ్మవద్దు.. అంటూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

  • స్పష్టం చేసిన మంత్రి హరీశ్‌రావు
  • నంగునూరు: నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగుతుంది.. ఎవరి మాటలు నమ్మవద్దు.. అంటూ  రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మండల పర్యటనలో భాగంగా శనివారం ఆయన నంగునూరులోని మైసమ్మచెరువును  సందర్శంచి ప్రత్యేక పూజలు చేశారు. అనం‍తరం హరీశ్‌రావు మాట్లాడుతూ నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగుతుందన్నారు.

    కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టస్తున్నారన్నారు.  నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే ఉంటుందని మంత్రి ప్రకటించడం పట్ల మండల నాయకులతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement