డబ్బు కో్సం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు.
జియలమ్మవలస: డబ్బు కో్సం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక ప్రజలను పట్టి పీడిస్తున్నారు. తాజాగా ఓ రైతు నుంచి తహశీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
విజయనగరం జిల్లా జియమ్మవలసకు చెందిన ఓ రైతు వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న తహిశీల్దార్ కొల్లి వెంకటరావును ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఆయన్ని విచారణ చేపడుతున్నారు. పార్వతీపురంలో ఉన్న తహశీల్దార్ నివాసంలో కూడా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.