వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Feb 20 2017 12:06 AM | Updated on Sep 5 2017 4:07 AM

పెండ్లిమర్రి మండలంలోని మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన బండి చంద్రశేఖర్‌రెడ్డి (46) అనే వ్యక్తి శనివారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పెండ్లిమర్రి: పెండ్లిమర్రి మండలంలోని మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన బండి చంద్రశేఖర్‌రెడ్డి (46) అనే వ్యక్తి శనివారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు చంద్రశేఖర్‌రెడ్డి అనారోగ్య సమస్య కారణంగా జీవితంపై విరక్తి చెంది విషపు గుళికలు మింగాడు. కుటుంబ సభ్యులు గమనించి కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సింగల్‌ విండో అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రోషన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement