Telangana News: 'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్‌ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్‌!
Sakshi News home page

'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్‌ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్‌!

Sep 21 2023 1:56 AM | Updated on Sep 21 2023 7:30 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: రిమ్స్‌లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సీరియస్‌ అ య్యారు. డైరెక్టర్‌ జైసింగ్‌ రా థోడ్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్‌సోర్సింగ్‌ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement