కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

జైనథ్‌: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌యాదవ్‌ అ న్నారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి చేరవేసేందు కు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చే యాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, సాజిద్‌ ఖాన్‌, సంజీవ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

భోరజ్‌, సాత్నాలలో..

సాత్నాల: కాంగ్రెస్‌ పార్టీ భోరజ్‌, సాత్నాల మండల కమిటీల నియామకాల కోసం ఆయా మండలకేంద్రాల్లో ఆదివారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా సిద్ధం చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ అధికార ప్రతినిధి గోవర్ధన్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ సంతోష్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్‌ పటేల్‌, దీపక్‌రావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

విమానాశ్రయానికి కాంగ్రెస్‌ కృషే కారణం

ఆదిలాబాద్‌(బేల):జిల్లాకు విమానాశ్రయం మంజూ రుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి కృషే ప్రధాన కారణమని రాజ్‌గోండ్‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే విమానాశ్రయం కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసి పునా ది వేశానని తెలిపారు. అభివృద్ధి పనులకు బీజేపీ నాయకులు క్రెడిట్‌ తీసుకోవడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్‌ కార్డులు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో మాధవ్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement