ఆదిలాబాద్: మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎంపీ గోడం నగేశ్‌ను సీసీఐ సాధన సమితి ప్రతినిధులు కోరారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని వివరించా రు. ఈ మేరకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఇందులో సమితి కన్వీనర్ మల్లేశ్, కోకన్వీనర్లు నారా యణ, రమేష్, సభ్యులు సంతోష్, జగన్‌సింగ్, పోశెట్టి, దేవిదాస్, ప్రశాంత్ వాగ్మారే, రమేష్, విఠల్ దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.


