అథ్లెటిక్స్‌ రాష్ట్ర సదస్సులో జిల్లా ప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ రాష్ట్ర సదస్సులో జిల్లా ప్రతినిధులు

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

ఆదిలాబాద్‌: హన్మకొండలో ఆదివారం నిర్వహించిన రెండో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అధికారుల సదస్సులో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ అథ్లెటిక్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో టెక్నికల్‌ అధికారులకు తాజా నిబంధనలు, పోటీల నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర అథ్లెటిక్స్‌ నిర్వాహకులు వెంకటేశ్వర్‌, అథ్లెటిక్స్‌ కార్యదర్శి పి.రాజేశ్‌, కోచ్‌ వీజీఎస్‌ రాకేశ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ కార్యదర్శి వీజీఎస్‌ జ్యోతీశ్వరన్‌ పాల్గొన్నారు. అలాగే పీడీలు సౌమ్య, సుజాత, రాజశ్రీ, రాహుల్‌ అగార్కర్‌, శివతో పాటు రాష్ట్ర అథ్లెట్లు అనిల్‌, వంశీ, జశ్వంత్‌, వసంత, అరుణ, స్వాతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement