రక్తస్రావంతో వ్యక్తి మృతి | Man bleeding to death | Sakshi
Sakshi News home page

రక్తస్రావంతో వ్యక్తి మృతి

Feb 17 2017 10:05 PM | Updated on Sep 5 2017 3:57 AM

రక్తస్రావంతో వ్యక్తి మృతి

రక్తస్రావంతో వ్యక్తి మృతి

స్థానిక హోమస్‌పేటకు చెందిన బంటు నాగూరయ్య (32) అనే వ్యక్తి తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు

ప్రొద్దుటూరు క్రైం: స్థానిక హోమస్‌పేటకు చెందిన బంటు నాగూరయ్య (32) అనే వ్యక్తి తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగూరయ్య గతంలో క్లీనర్‌గా పని చేసే వాడు. కొన్ని నెలల నుంచి అతను మద్యానికి బానిసై జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి దొరసానిపల్లెలో అతని స్నేహితులు బాడుగ విషయమై వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్లాడు. సహనం కోల్పోయిన తాను పక్కనే ఉన్న రాయితో ఆటో అద్దాలను పగులకొట్డాడు. తర్వాత తన చేత్తో అద్దాన్ని పగులకొట్టే క్రమంలో గుచ్చుకొని తీవ్ర స్రావం అయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను కొన్ని గంటల తర్వాత మృతి చెందాడు. భార్య వసంత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ జీఎండీ బాషా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement