breaking news
Homaspeta
-
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
బెంగళూరు: బద్వేలు నుంచి బెంగళూరు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హోమస్ పేట సమీపంలో గురువారం ఉదయం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బెంగళూరులోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రక్తస్రావంతో వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక హోమస్‌పేటకు చెందిన బంటు నాగూరయ్య (32) అనే వ్యక్తి తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగూరయ్య గతంలో క్లీనర్‌గా పని చేసే వాడు. కొన్ని నెలల నుంచి అతను మద్యానికి బానిసై జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి దొరసానిపల్లెలో అతని స్నేహితులు బాడుగ విషయమై వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్లాడు. సహనం కోల్పోయిన తాను పక్కనే ఉన్న రాయితో ఆటో అద్దాలను పగులకొట్డాడు. తర్వాత తన చేత్తో అద్దాన్ని పగులకొట్టే క్రమంలో గుచ్చుకొని తీవ్ర స్రావం అయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను కొన్ని గంటల తర్వాత మృతి చెందాడు. భార్య వసంత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ జీఎండీ బాషా తెలిపారు.