తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన అయుత చండీయాగం చివరి దిశకు చేరుకుంది.
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన అయుత చండీయాగం చివరి దిశకు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం యాగంలో ముగింపు కార్యక్రమమైన మహాపూర్ణాహుతి 2 వేల మంది రుత్వికులతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు.
గత నాలుగు రోజులుగా ఎర్రవల్లిలో భక్తిశ్రద్దలతో చండీయాగం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు యాగశాల వద్ద అగ్నిప్రమాదం జరిగిందని ..ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరికాసేపట్లో శాస్త్రోక్తంగా యాగం ముగుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. యాగం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.