నేడు వరసిద్ధుడి తెప్పోత్సవం | lord vinayaka teppostavam today | Sakshi
Sakshi News home page

నేడు వరసిద్ధుడి తెప్పోత్సవం

Sep 24 2016 6:55 PM | Updated on Sep 4 2017 2:48 PM

తెప్పోత్సవానికి పుష్కరిణి శుద్ధి చేసి నీటిని నింపిన దృశ్యం

తెప్పోత్సవానికి పుష్కరిణి శుద్ధి చేసి నీటిని నింపిన దృశ్యం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం జరగనున్నది. ఇందులో భాగంగా రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలపై (పల్లకిపై) ఆలయ పుష్కరణిలో విహరించనున్నారు.

 
కాణిపాకం(ఐరాల):
 కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం జరగనున్నది. ఇందులో భాగంగా రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  తెప్పలపై (పల్లకిపై) ఆలయ పుష్కరణిలో విహరించనున్నారు. ఉత్సవ ఉభయదారులు ఇందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు.
స్వామి వారి లడ్డూ వేలం 
బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన తెప్పోత్సవం అనంతరం స్వామి వారికి ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాన్ని తయారు  చేసేవారు. 21 కిలోల బరువుగల లడ్డూ ప్రసాదాన్ని  మూల విగ్రహం వద్ద 21 రోజుల పాటూ ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి ఉత్సవాల అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పీ పూర్ణచంద్రరావు తెలిపారు.
తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు 
వినాయకస్వామి వారి ఆలయంలో ఆదివారం నిర్వహించే ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున జరుగుతున్న తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రరావు శనివారం తెలిపారు. ఆలయ కార్యాలయ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకోత్సవాల్లో ఆఖరి రోజున ఆదివారం రాత్రి స్వామివారికి వైభవంగా వాహన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న ఈ ఉత్సవం కోసం పుష్కరిణిని శుద్ధి చేసి నీటిని నింపినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తూరు సీఐ ఆదినారాయణ, కాణిపాకం ఎస్‌ఐ నరేష్‌బాబు మాట్లాడుతూ ఉత్సవ కార్యక్రమాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement